బస్సుల రిజిస్ట్రేషన్ బదిలీకి సిద్ధం: రాంప్రసాద్‌రెడ్డి
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:41 AM
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా..
రామాపురం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా రామాపురం నుంచి అఖిల భారత పర్యాటక బస్సుల యజమానుల సంఘం సభ్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో నమోదై ఉన్న 700 నుంచి 800 బస్సులను ఏపీకి బదిలీ చేసుకునేలా ఆయా బస్సు యజమానులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని చెప్పారు. త్రైమాసిక ఫీజును ఒక్కో సీటుకు రూ.4వేల నుంచి రూ.2,500లకు తగ్గిస్తామని హమీ ఇచ్చారు. భద్రతా వ్యవస్థలున మరింత బలోపేతం చేయడంతోపాటు బస్సుల ఫిట్‌నె్‌సను నిర్ధారించడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చేయిస్తామన్నారు.