ఉద్యోగుల స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా సీసీఎల్‌ఏ
ABN , Publish Date - Aug 25 , 2026 | 05:37 AM
సీసీఎల్‌ఏ, స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి చైర్‌పర్సన్‌గా స్టాండింగ్ కమిటీని పునర్య్వవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): సీసీఎల్‌ఏ, స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి చైర్‌పర్సన్‌గా స్టాండింగ్ కమిటీని పునర్య్వవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, కారుణ్య నియామకాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వనుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ పదవీ విరమణతో ఏర్పాటైన ఈ కమిటీలో ఆరుగురు అధికారులు సభ్యులుగా ఉండగా, జీఏడీ జాయింట్ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.