కొత్త జిల్లా కేంద్రాల్లోనూ 16శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలి
ABN , Publish Date - May 07 , 2026 | 03:52 AM
నూతనంగా ఏర్పాటు చేసిన మూడు కొత్త జిల్లాల్లో ఉద్యోగులందరికీ 16శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ఏపీ ...
సీఎస్‌కు ఏపీఎన్జీఓ నేతల వినతి
విజయవాడ అర్బన్, మే 6 (ఆంధ్రజ్యోతి): నూతనంగా ఏర్పాటు చేసిన మూడు కొత్త జిల్లాల్లో ఉద్యోగులందరికీ 16శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ఏపీ ఎన్జీవో రాష్ట్ర నాయకులు కోరారు. బుధవారం ఏపీ ఎన్జీవో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ ఆధ్వర్యంలో వెలగపూడి సచివాలయంలో సీఎస్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై ఆయనకు వినతి పత్రాలను అందజేశారు. ముఖ్యంగా గతంలో ఏర్పాటైన జిల్లాల్లో మాదిరిగానే, మార్కాపురం, రంపచోడవరం, పోలవరం కొత్త జిల్లాల కేంద్రాల్లో కూడా ఉద్యోగులందరికీ 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై సీఎస్ సానుకూలంగా స్పంచారని నేతలు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, కార్యదర్శి రజనీశ్‌బాబు తదితరులు సీఎ్‌సను కలిసినవారిలో ఉన్నారు.