ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధం కావాలి: బొప్పరాజు
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:30 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధమవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
విజయవాడ, జూన్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధమవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలో ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై జేఏసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బొప్పరాజు మాట్లాడుతూ, మధ్యంతర భృతి, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, పెండింగ్ డీఏలు, 12వ పీఆర్సీ ఎరియర్స్ చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పలు దఫాలుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించకపోవడంతో ఉద్యమం అనివార్యమైందన్నారు. ఈ నెల 25 నుంచి జూలై 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డివిజన్లలో ఉద్యమ సన్నద్ధ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.