Share News

మా ఇబ్బందులు పట్టించుకోండి!

ABN , Publish Date - Aug 15 , 2026 | 04:59 AM

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల మూడోవారంలో సీఎం చంద్రబాబుతో సమావేశం జరిగే అవకాశం..

మా ఇబ్బందులు పట్టించుకోండి!

  • సర్కారుకు ఏపీ జేఏసీ చైర్మన్‌ వినతి

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల మూడోవారంలో సీఎం చంద్రబాబుతో సమావేశం జరిగే అవకాశం ఉందని ఏపీ జేఏసీ చైర్మన్‌, ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు పీఆర్‌సీ, డీఏ, ఐఆర్‌, తదితర అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన కార్యాచరణ చేపట్టేందుకు ఏపీజేఏసీ సిద్ధంగా ఉందన్నారు. ఆగస్టు చివర్లో ఏపీ జేఏసీ విస్తృత రాష్ట్ర స్థాయి సమావేశం జరగనున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 15 , 2026 | 05:01 AM