పీఆర్సీ, ఐఆర్ కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూపులు?
ABN , Publish Date - May 18 , 2026 | 04:58 AM
పీఆర్సీ, ఐఆర్ కోసం ఉద్యోగులు ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్
విజయవాడ, మే 17 (ఆంధ్రజ్యోతి) : పీఆర్సీ, ఐఆర్ కోసం ఉద్యోగులు ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే పీఆర్సీ చైర్మన్‌ను నియమించి మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఎన్జీజీవో హోంలో ఆదివారం జరిగింది. విద్యాసాగర్ మాట్లాడుతూ 2023 నుంచి వేతన సవరణ కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల బకాయిల చెల్లింపులు, పోలీస్ కేసుల ఎత్తివేత తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకెళ్లడం, సుమారు రూ.21 వేల కోట్ల బకాయిల విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. ఐవీఆర్‌ఎస్ వ్యవస్థను కేవలం ఒక మోడల్‌గా పరిగణించి తగిన విధానాలు అవలంబించాలి కానీ, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడం తగదని కార్యవర్గం పేర్కొంది.