Share News

కరెంట్‌.. తెగ వాడేస్తున్నారు

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:34 AM

రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా విద్యుత్తు వినియోగం భా రీగా పెరిగింది. గత ఏడాది మండువేసవిలో ఏప్రిల్‌, మే నెలల్లో గరిష్ఠ విద్యుత్తు వినియోగం 256 మిలియన్‌ యూనిట్లు కాగా...

కరెంట్‌.. తెగ వాడేస్తున్నారు

  • వారం నుంచి భారీగా పెరిగిన విద్యుత్తు డిమాండ్‌

  • 7న గరిష్ఠంగా 274.6 మిలియన్‌ యూనిట్ల వినియోగం

  • 3 రోజులుగా 272 మి.యూ. నమోదు.. గతేడాది 249 మి.యూ. మాత్రమే

  • పెరిగిన ఎలక్ట్రిక్‌ స్ట్టవ్‌లు, కుక్కర్ల వినియోగం

అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా విద్యుత్తు వినియోగం భా రీగా పెరిగింది. గత ఏడాది మండువేసవిలో ఏప్రిల్‌, మే నెలల్లో గరిష్ఠ విద్యుత్తు వినియోగం 256 మిలియన్‌ యూనిట్లు కాగా, ఈ ఏడాది మార్చి నెల 7న 274.6 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదైంది. ఆ తర్వాత కూడా సగటు వినియోగం 270 మిలియన్‌ యూనిట్లుగా నమోదవుతూ వస్తోంది. ఈ నెల 12, 13, 14 తేదీల్లోనూ వరుసగా 272 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదైంది. గత ఏడాది మార్చి 1 నుంచి 15 వరకు గరిష్ఠ విద్యుత్తు వినియో గం 248.88 మిలియన్‌ యూనిట్లు మార తమే. గతేడా ది ఇదే సమయానికి వినియోగించిన విద్యుత్తు కంటే ఈ సారి 9.15 శాతం ఎక్కువగా వాడుతున్నారు.


ఉష్ణోగ్రతలు.. యుద్ధం

వారం రోజులుగా అకస్మాత్తుగా విద్యుత్తు వినియోగం భారీగా పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం. మరొకటి పశ్చిమాసియా యుద్ధ ప్రభావం. మార్చి మొదటి రోజు నుంచే 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో ఉక్కపోత కూడా పెరిగింది. ఈ కారణంగా సహజంగానే విద్యుత్తు వినియోగం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కారణంగా వంట గ్యాస్‌ లభ్యత తగ్గుతుందనే ఆందోళనతో చాలా మంది గా ్యస్‌ను పొదుపుగా వాడుకుంటున్నారు. ఇండక్షన్‌ స్ట్టవ్‌లు, ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్ల వినియోగం గణనీయంగా పెరిగిందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే.. ఉదయం 8 గంటల నుం చి 10 గంటలలోపు విద్యుత్తు వినియోగం గతంలో కన్నా ఎక్కువ నమోదవుతోందని వివరిస్తున్నారు.


ఇదే ట్రెండ్‌ కొనసాగితే..

గత ఐదేళ్లలో ఏప్రిల్‌, మే నెలల్లో గరిష్ఠ విద్యుత్తు వినియోగం 256 మిలియన్‌ యూనిట్లు. ఈ ఐదేళ్ల వినియోగం ఆధారంగా ఈ ఏడాది మే నెలలో గరిష్ఠంగా 280 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగం ఉండొచ్చని విద్యుత్తు శాఖ అధికారులు అంచనా వేశారు. ఇటీవల జరిపిన సమీక్ష సమావేశంలో సైతం విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ 280 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌కు తగిన విధంగా విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే మార్చి నెల సగంలోనే 274.6 మిలియన్‌ యూనిట్లకు విద్యుత్తు వినియోగం చేర డం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే ట్రెండ్‌ కొనసాగితే మే నాటికి అంచనాలను మించి విద్యుత్తు వినియోగం 300 యూనిట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కరలేదని అధికారులు చెబుతున్నారు.


గత మూడేళ్లలో వేసవిలో విద్యుత్తు వినియోగం

  • 2025 మార్చిలో గరిష్ఠ విద్యుత్తు వినియోగం 256.87 మిలియన్‌ యూనిట్లు. ఆ ఏడాది ఏప్రిల్‌, మేలో వాతావరణ మార్పుల కారణంగా విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గింది. సగటు వినియోగం 240 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది.

  • 2024 మార్చిలో గరిష్ఠ వినియోగం 246 మిలియన్‌ యూనిట్లు. ఆ ఏడాది ఏప్రిల్‌, మేలో గరిష్ఠంగా 262 మిలియన్‌ యూనిట్లకు చేరింది.

  • 2023 మార్చిలో గరిష్ఠ విద్యుత్తు వినియోగం 231 మిలియన్‌ యూనిట్లు. ఆ ఏడాది ఏప్రిల్‌, మేలో గరిష్ఠంగా 247.91 మిలియన్‌ యూనిట్లకు చేరింది.

Updated Date - Mar 15 , 2026 | 05:35 AM