Share News

నోటిఫికేషన్‌ ప్రకారమే ఏఈఈ పోస్టుల భర్తీ

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:49 AM

ఏపీ విద్యుత్తు సంస్థల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు(ఏఈఈ) పోస్టుల దరఖాస్తుల గడువు పొడిగింపు ఉండదని ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ స్పష్టం చేశారు.

నోటిఫికేషన్‌ ప్రకారమే ఏఈఈ పోస్టుల భర్తీ

  • షెడ్యూల్‌ ప్రకారమే ఆగస్టు 22 నుంచి పరీక్షలు: ప్రవీణ్‌ చంద్‌

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఏపీ విద్యుత్తు సంస్థల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు(ఏఈఈ) పోస్టుల దరఖాస్తుల గడువు పొడిగింపు ఉండదని ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్‌ 25న నోటిఫికేషన్‌ విడుదల చేశాం. దానికివిశేష స్పందన లభిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగింపుపై సామాజిక మాధ్యమాలు, ఇతర అనధికార వేదికల్లో ప్రచారం లో ఉన్న వార్తలను విశ్వసించ వద్దు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కూడా షెడ్యూల్‌ ప్రకారమే ఈ ఏడాది ఆగస్టు 22 నుంచి ప్రారంభమవుతుంది. పరీక్ష తేదీల్లో కూడా మార్పు ఉండదు’ అని ప్రవీణ్‌ స్పష్టం చేశారు.

Updated Date - Jul 14 , 2026 | 04:51 AM