యూనివర్సిటీలకు ఉమ్మడి చట్టం!
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:15 AM
లేజీలకు అనుమతుల జారీ, ఇతర నిబంధనల విషయాల్లో ఇకపై ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో విధానం ఉందని, యూనివర్సిటీలకు ఉమ్మడి చట్టం తీసుకొస్తున్నామని విద్యా శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు.
ఫొటోలు, జియో ట్యాగింగ్ ద్వారానే అనుమతులు
అసెంబ్లీలో విద్యా మంత్రి లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కాలేజీలకు అనుమతుల జారీ, ఇతర నిబంధనల విషయాల్లో ఇకపై ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో విధానం ఉందని, యూనివర్సిటీలకు ఉమ్మడి చట్టం తీసుకొస్తున్నామని విద్యా శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. నన్నయ వర్సిటీలో అక్రమాలు, పుట్టపర్తిలో ఆర్జీయూకేటీ క్యాంపస్ ఏర్పాటుపై ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, పల్లె సింధూరరెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు గురువారం అసెంబ్లీలో ఆయన సమాధానమిచ్చారు. నన్నయ వర్సిటీలో అక్రమాలపై ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌పై వస్తున్న ఆరోపణలపైనా చర్యలు చేపడతామన్నారు. ఉమ్మడి చట్టంలో ఫొటోలు, జియో ట్యాగింగ్ ద్వారానే అనుమతులు ఇస్తామన్నారు. ఆర్జీయూకేటీల అంశంపై మంత్రి లోకే శ్ మాట్లాడుతూ, పుట్టపర్తిలో ఆర్జీయూకేటీ క్యాంపస్ ఏర్పాటుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతమున్న నాలుగు క్యాంప్‌సల్లో పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపా రు. నూజివీడు క్యాంప్‌సకు రూ.60 కోట్లు, ఆర్కే వ్యాలీ కి రూ.40 కోట్లు, ఒంగోలుకు రూ.600 కోట్లు, శ్రీకాకు ళం క్యాంప్‌సకు రూ.300 కోట్లు నిధులు అవసరమని వివరించారు. సౌకర్యాలు కల్పించి ఎక్కడి విద్యార్థులు అక్కడే కోర్సు పూర్తిచేసేలా చూస్తామన్నారు. ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ.. నన్నయ వర్సిటీలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకపోయినా ముడుపులు తీసుకుని కాలేజీలకు అనుమతులు మంజూరు చేశారని ఆరోపించారు. ఒకే అధ్యాపకుడు ఐదారు కాలేజీల్లో పనిచేస్తున్నా, పట్టించుకోవడం లేదన్నారు. అనుమతుల జారీ సమయంలో సినిమా తరహాలో తాత్కాలిక సెట్టింగ్‌లు వేస్తున్నారన్నారు. ఈసీలో మాజీ మంత్రి అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే మామను గతంలో నియమించారని, వారితో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
పుత్తూరు చైర్మన్‌ను తొలగించాం: నారాయణ
పదవి దుర్వినియోగం, నిబంధనల పాటింపులో ని ర్లక్ష్యం వహించిన పుత్తూరు మున్సిపల్ చైర్మన్‌ను పద వి నుంచి తొలగించామని, 9న గెజిట్ జారీచేశామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎమ్మెల్యే భానుప్రకాశ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
పరిశీలనలో గిరిజన ప్రాంతాల రిజర్వేషన్
షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీలకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేశామని, తుది నిర్ణయం కోసం ప్రభుత్వ పరిశీలనకు పంపామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
తోటపల్లి సామర్థ్యం పెంచుతాం: నిమ్మల
తోటపల్లి బ్యారేజీ కుడి కాలువ సామర్థ్యాన్ని 800 నుంచి 1,200 క్యూసెక్కులకు పెంచుతామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లోచెర్ల- శివడవలస ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎమ్మెల్యే రంగారావు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.
అమలాపురంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థుల కోసం రెండు హాస్టళ్లపై ప్రతిపాదనలు రూపొందించి, మంజూరయ్యేలా చూస్తామని మంత్రి డోలా తెలిపారు. హాస్టళ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు.
డైట్ చార్జీలపై సమీక్ష: మంత్రి సవిత
బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు ఇస్తున్న డైట్ చార్జీల సవరణ, పెంపు అంశాన్ని సమీక్షిస్తున్నట్లు బీసీ సంక్షేమ మంత్రి సవిత తెలిపారు. సమస్యను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రస్తావించారు. తిరుపతి, తిరుమలలో తాగునీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. ప్రతిపాదనలు చేశామని మంత్రి నిమ్మల తెలిపారు.