ఏపీ విద్యకు కేంద్రం ప్రశంస
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:22 AM
ఏపీలో డిజిటల్ విద్య అమలుకు చేపట్టిన సంస్కరణలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఏపీలో డిజిటల్ విద్య అమలుకు చేపట్టిన సంస్కరణలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన ‘ఆధార్ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ సమావేశంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. డీబీటీ విధానంలో ‘తల్లికి వందనం’ నగదు పంపిణీ చేస్తున్నామని, ‘పీఎంశ్రీ’ పథకం అమలు, శానిటరీ న్యాప్‌కిన్స్, ఉపకారవేతనాలు, రవాణా సదుపాయాలు ఒకే డిజిటల్ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకొచ్చినట్లు వివరించారు.