Share News

విద్యార్థులు లేకపోతే ‘మిగులు’గా టీచర్లు

ABN , Publish Date - Jun 26 , 2026 | 06:10 AM

ఏదైనా పాఠశాలలో అసలు విద్యార్థులు లేకపోతే.. అక్కడ పనిచేసే టీచర్లను మిగులుగా చూపించి సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ గురువారం స్పష్టం చేసింది.

విద్యార్థులు లేకపోతే ‘మిగులు’గా టీచర్లు

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఏదైనా పాఠశాలలో అసలు విద్యార్థులు లేకపోతే.. అక్కడ పనిచేసే టీచర్లను మిగులుగా చూపించి సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ గురువారం స్పష్టం చేసింది. ఒక పాఠశాలలో ఎస్జీటీ, ఎంటీఎస్‌ టీచర్‌ పనిచేస్తుంటే... వారిలో ఒకరిని మిగులుగా చూపాల్సి వస్తే ఎంటీఎస్‌ టీచర్‌ మిగులు అవుతారని వివరించింది. ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్‌, గణితం ఇద్దరు టీచర్లు పనిచేస్తుండగా.. ఒకరు మిగులుగా మారాల్సి వస్తే గణితం టీచర్‌ను మిగులుగా చూపించాలని స్పష్టం చేసింది. డిప్యుటేషన్లపై పనిచేస్తున్న టీచర్ల స్థానాలను సర్దుబాటు చేయాలని తెలిపింది. గతేడాది 40 మంది విద్యార్థులున్న బేసిక్‌ ప్రైమరీ పాఠశాలలో ఇప్పుడు 60 మంది విద్యార్థులుంటే దానిని మోడల్‌ ప్రై మరీ స్కూల్‌గా మార్చి ఐదుగురు ఎస్జీటీలను కేటాయించాలని స్పష్టం చేసింది.

Updated Date - Jun 26 , 2026 | 06:10 AM