ఫిన్‌లాండ్ విద్యా విధానాలపై అధ్యయనం
ABN , Publish Date - Aug 16 , 2026 | 04:55 AM
రాష్ట్రంలో ఉత్తమ విద్యా విధానాలను అమలు చేసేందుకు రాష్ట్రానికి చెందిన పలువురు ఉపాధ్యాయులు ఫిన్‌లాండ్ విద్యా విధానాలపై ఆధ్యయనం చేయనున్నారు.
ఆ దేశ పర్యటనకు 29 మంది టీచర్లు
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉత్తమ విద్యా విధానాలను అమలు చేసేందుకు రాష్ట్రానికి చెందిన పలువురు ఉపాధ్యాయులు ఫిన్‌లాండ్ విద్యా విధానాలపై ఆధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు 29 మంది ఉత్తమ టీచర్లు ఈ నెల 17 నుంచి 26 వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. వివిధ ప్రాంతాలను సందర్శించి, అక్కడి విధానాలపై ఇక్కడి సహచర టీచర్లకు వారు శిక్షణ ఇస్తారు.