ఎడ్‌సెట్‌లో 99.3 శాతం అర్హత
ABN , Publish Date - May 27 , 2026 | 05:29 AM
బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ మంగళవారం ఎక్స్‌లో ప్రకటించారు. మొత్తం 24,628 మంది రిజస్టర్ చేసుకోగా 19,880 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఎక్స్‌లో ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్
అమరావతి, కుప్పం, మే 26(ఆంధ్రజ్యోతి): బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ మంగళవారం ఎక్స్‌లో ప్రకటించారు. మొత్తం 24,628 మంది రిజస్టర్ చేసుకోగా 19,880 మంది పరీక్షకు హాజరయ్యారు. 19,741 మంది (99.3శాతం) అర్హత సాధించారు. గణితంలో 99.86శాతం, ఫిజికల్ సైన్స్‌లో 99.79శాతం, బయలాజికల్ సైన్స్‌లో 99.31శాతం, సోషల్ స్టడీస్‌లో 98.68శాతం, ఇంగ్లీష్ లో 98.32శాతం మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే 38 శాతం అదనంగా ఈ ఏడాది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 99.8శాతం మంది, కడపలో అత్యల్పంగా 98.19శాతం మంది అర్హత సాధించారు. ఎడ్‌సెట్‌ను నిర్వహించిన చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఫలితాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వర్సిటీ ఉప కులపతి ఎల్.సి.మల్లయ్య, రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ డి.శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు. ర్యాంకు కార్డులు https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspxలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.