ఈఏపీసెట్ ఫలితాలు నేడే!
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:00 AM
ఈఏపీసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు విద్యా శాఖ సిద్ధమైంది! ఇందులో భాగంగా ప్రవేశ పరీక్ష కమిటీ సమావేశం ఉదయం 11 గంటలకు జరగనుంది.
మధ్యాహ్నం 3 గంటలకు విడుదల
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు విద్యా శాఖ సిద్ధమైంది! ఇందులో భాగంగా ప్రవేశ పరీక్ష కమిటీ సమావేశం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఏదైనా ప్రవేశ పరీక్ష ఫలితాలను వెల్లడించే ముందు సంబంధిత సెట్ కమిటీ సమావేశం జరగాలి. అయితే సోమవారం వరకు ఈ భేటీ జరగకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సెట్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు సమాయత్తమైనట్లు సమాచారం. సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ రెండో విడత ఫలితాలను పక్కనపెట్టి ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీని వలన కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగేలా విద్యాశాఖ చర్యలు కనిపిస్తున్నాయి.