నెలాఖరుకు ఏపీఈఏపీసెట్ ఫలితాలు
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:04 AM
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న ఏపీఈఏపీసెట్-2026 ఫలితాలను ఈ నెలాఖరుకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు..
జేఎన్టీయూకే వీసీ, సెట్ చైర్మన్ సీఎస్‌ఆర్కే ప్రసాద్
జేఎన్టీయూకే, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న ఏపీఈఏపీసెట్-2026 ఫలితాలను ఈ నెలాఖరుకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సెట్ చైర్మన్ జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. గత నెల 12 నుంచి 20 వరకూ నిర్వహించిన పరీక్షలకు సుమారు 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికే ఫలితాలను విడుదలచేయాల్సి ఉంది. అయితే ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండగా, ఈ ఏడాది ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు అవకాశం కల్పించడంతో ఈఏపీసెట్ ఫలితాలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 18న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైనా.. సీబీఎ్‌సఈ 12వ తరగతి ఫలితాల్లో సాంకేతిక ఇబ్బందుల కారణంగా రివైజ్డ్ ఫలితాలను ఈ నెలాఖరుకి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 8వేల మందికి పైగా సీబీఎస్ఈ విద్యార్థులు ఈ ఏడాది ఈఏపీసెట్ రాశారని, ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరుగకూడదని ఈ క్రమంలో ఈఏపీసెట్ ర్యాంకుల ప్రకటన వారం రోజులు ఆలస్యమైనా పర్వాలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సూచించారని సీఎ్‌సఆర్కే ప్రసాద్ తెలిపారు.