Share News

రేపు ఏపీఈఏపీసెట్‌ ప్రాథమిక కీ విడుదల

ABN , Publish Date - May 24 , 2026 | 04:58 AM

ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ ఏపీ, హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌-2026 ప్రవేశపరీక్షకు సంబంధించిన ఇంజనీరింగ్‌..

రేపు ఏపీఈఏపీసెట్‌ ప్రాథమిక కీ విడుదల

జేఎన్టీయూకే, మే 23 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ ఏపీ, హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌-2026 ప్రవేశపరీక్షకు సంబంధించిన ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల ప్రాథమిక కీని 25వ తేదీ (సోమవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈఏపీసెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్‌ తెలిపారు. విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లను https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపారు. ప్రాథమిక కీ పై విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటల వరకూ వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా తెలియచేయవచ్చన్నారు.

Updated Date - May 24 , 2026 | 04:59 AM