Share News

ఏపీ ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌కు 93.37 శాతం హాజరు

ABN , Publish Date - May 15 , 2026 | 04:48 AM

ఏపీ ఈఏపీసెట్‌ 2026 పరీక్షలు రాష్ట్రంలో గురువారం కొనసాగాయి. ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి మూడోరోజు గురువారం ఉదయం 25,542 మంది విద్యార్థులు...

ఏపీ ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌కు 93.37 శాతం హాజరు

కాకినాడ, మే 14 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఈఏపీసెట్‌ 2026 పరీక్షలు రాష్ట్రంలో గురువారం కొనసాగాయి. ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి మూడోరోజు గురువారం ఉదయం 25,542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 23,797 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 29,305 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 27,413 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తంగా 93.37 శాతం హాజరు నమోదైనట్టు ఏపీ ఈఏపీసెట్‌ చైర్మన్‌ సీఎస్ఆర్‌కే ప్రసాద్‌, కన్వీనర్‌ మోహన్‌రావు వెల్లడించారు.

Updated Date - May 15 , 2026 | 04:49 AM