’రేపటిలోగా సీబీఎస్‌ఈ రీవేల్యూయేషన్ డిక్లరేషన్ ఫారాన్ని సమర్పించాలి
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:07 AM
ఏపీఈఏపీసెట్-2026కు హాజరై సీబీఎస్‌ఈ రీ వెరిఫికేషన్, రీ వేల్యూయేషన్ అనంతరం మార్కుల్లో మెరుగుదల వచ్చిన అభ్యర్థులు..
ఏపీఈఏపీసెట్-2026 కన్వీనర్ మోహన్‌రావు
జేఎన్టీయూకే, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ఏపీఈఏపీసెట్-2026కు హాజరై సీబీఎస్‌ఈ రీ వెరిఫికేషన్, రీ వేల్యూయేషన్ అనంతరం మార్కుల్లో మెరుగుదల వచ్చిన అభ్యర్థులు సీబీఎస్‌ఈ రీ వేల్యూయేషన్ డిక్లరేషన్ ఫారాన్ని సమర్పించాలని సెట్ కన్వీనర్ ఎన్.మో హన్‌రావు సూచించారు. https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 27 సాయంత్రం 5గంటల్లోపు డిక్లరేషన్ ఫారాన్ని సమర్పించాలని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.