Share News

పారదర్శకంగానే ఉద్యోగాలు సాధించాం

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:56 AM

తమ నియామకాన్ని అపహాస్యం చేస్తున్న వైసీపీపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆందోళనలకు..

పారదర్శకంగానే ఉద్యోగాలు సాధించాం

  • వైసీపీ మా మనోభావాలను దెబ్బతీస్తోంది: డీఎస్సీ అభ్యర్థుల ధ్వజం

  • వైసీపీ తీరుకు నిరసనగా నందిగామలో ఉపాధ్యాయుల ర్యాలీ

నందిగామ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): తమ నియామకాన్ని అపహాస్యం చేస్తున్న వైసీపీపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆందోళనలకు వ్యతిరేకంగా కదం తొక్కారు. కష్టపడి చదివి నైపుణ్యంతో ఉద్యోగాలు సంపాదించామని స్పష్టం చేశారు. అక్రమాలు అంటూ వైసీపీ తమ మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. నందిగామ పట్టణంలో ఆదివారం ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. చదువు విలువ తెలియని వైసీపీ అల్లరిమూకలు అసత్య ప్రచారాలతో రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాయని, ఢిల్లీలో వలే ఆందోళనలకు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పారదర్శకంగా ఉద్యోగాలు సాధించామని, తమ మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. ఉపాధ్యాయుల ర్యాలీకి ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య సంఘీభావం తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 03:57 AM