Share News

అనర్హుడితో వైసీపీ డీఎస్సీ నిరసన

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:23 AM

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ వైసీపీ నాయకులు చేస్తున్న దీక్షలు హాస్యాస్పదం అవుతున్నాయి.

అనర్హుడితో వైసీపీ డీఎస్సీ నిరసన

  • అరగుండు గీయించుకున్నాడంటూ ప్రచారం

విజయనగరం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ వైసీపీ నాయకులు చేస్తున్న దీక్షలు హాస్యాస్పదం అవుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని శంబంగి ఆరోపించారు. అందుకే ఓ నిరుద్యోగి అరగుండు గీయించుకుని నిరసన తెలిపారంటూ రోజంతా వైసీపీ ప్రచారం చేసింది. ఆ నిరుద్యోగి ఎవరా అని ఆరా తీయగా.. బాడంగి మండలం కోడూరు మదుర రామచంద్రపురం గ్రామానికి చెందిన తోట రాజశేఖర్‌గా తేలింది. అతనికి అసలు డిగ్రీ అర్హతే లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.

Updated Date - Aug 09 , 2026 | 05:26 AM