Share News

డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఎల్లుండి మెగా ర్యాలీ

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:52 AM

డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు మెగా ర్యాలీ నిర్వహణకు సిద్ధమయ్యారు.

డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఎల్లుండి మెగా ర్యాలీ

  • విజయవాడ ర్యాలీలో పాల్గొననున్న 10 వేల మందికిపైగా టీచర్లు

విజయవాడ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు మెగా ర్యాలీ నిర్వహణకు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తమ ప్రతిభను కించపరిచేలా ఉన్నాయని వారు మండిపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులపై తప్పుడు ప్రచారం ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి డీఎస్సీ-2025కు ఎంపికైన అభ్యర్థులు 16న విజయవాడలో నిర్వహిస్తున్న ఈ భారీ ర్యాలీలో పాల్గొంటున్నారు. సుమారు 10,000 నుంచి 13 వేల మంది వరకూ హాజరయ్యే అవకాశం ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ర్యాలీ బయలుదేరుతుంది. అంబేడ్కర్‌ స్మృతివనం చేరుకుని బాబాసాహెబ్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తారు. అక్కడే మానవహారం నిర్వహిస్తారు.

Updated Date - Aug 14 , 2026 | 04:54 AM