సమ్మె విరమించిన డాక్యుమెంట్ రైటర్లు
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:09 AM
డాక్యుమెంట్ రైటర్లు గురువారం మధ్యాహ్నం నుంచి సమ్మె విరమించారని స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.
నేటి నుంచి యథావిథిగా రిజిస్ర్టేషన్ సేవలు: ఐజీ అంబేడ్కర్
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): డాక్యుమెంట్ రైటర్లు గురువారం మధ్యాహ్నం నుంచి సమ్మె విరమించారని స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లతో సమావేశమైన ఐజీ... వారు లేవనెత్తిన ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించామని, రిజిస్ర్టేషన్ సేవా కేంద్రాల స్థాపన ఉద్దేశం, వాటి నిర్వహణ, ప్రజలకు అందించనున్న సేవలు, డాక్యుమెంట్ రైటర్స్ హక్కులు, అవకాశాలకు భంగం కలిగించే ఉద్దే శం లేదని స్పష్టం చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ర్టేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు వల్ల ప్రజలకు పారదర్శక, సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కమిషనర్ వివరణతో సంతృప్తి చెందిన డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సందేహాలు పూర్తిగా నివృత్తి అయినట్లు తెలిపి, సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి డాక్యుమెంట్ రైటర్లు యథావిథిగా సేవలు అందిస్తూ.. రిజిస్ర్టేషన్ కార్యకలాపాలకు సహకరిస్తారని కమిషనర్ తెలిపారు.