పదోన్నతి బాధ్యత పెంచుతుంది
ABN , Publish Date - Apr 01 , 2026 | 06:08 AM
శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం పనిచేసే పోలీసు శాఖలో పదోన్నతి పొందిన ప్రతి పోలీసుకు బాధ్యత మరింత పెరుగుతుందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు.
డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం పనిచేసే పోలీసు శాఖలో పదోన్నతి పొందిన ప్రతి పోలీసుకు బాధ్యత మరింత పెరుగుతుందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీఎస్పీకి చెందిన 300 మంది ఎస్‌ఐలుగా పదోన్నతి పొంది మధ్యంతర శిక్షణ పూర్తి చేసుకుని మంగళవారం మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు మర్యాద పూర్వక సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ‘ప్రమోషన్ పొందడం ప్రతి ఒక్కరికీ సంతోషమే. కానీ అంతకు మించి బాధ్యత పెరుగుతుంది’ అని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు రవిశంకర్ అయ్యన్నార్, రాజీవ్ కుమార్ మీనా, మహేశ్ చంద్ర లడ్డా, మధుసూధన్ రెడ్డి, రాజకుమారి, రవికృష్ణ, శ్రీకాంత్, రామక్రిష్ణ, రవి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.