Share News

పంటల బీమాకు అధికారులను కలవండి

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:31 AM

రాష్ట్రంలో వరి సాగు రైతులకు పంటల బీమా నమోదు గడువును ఈ నెల 31 వరకు పొడిగించగా, మిగిలిన పంటల రైతులు ప్రాంతాల వారీగా సంబంధిత బీమా కంపెనీలు..

పంటల బీమాకు అధికారులను కలవండి

  • రైతులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ సూచన

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరి సాగు రైతులకు పంటల బీమా నమోదు గడువును ఈ నెల 31 వరకు పొడిగించగా, మిగిలిన పంటల రైతులు ప్రాంతాల వారీగా సంబంధిత బీమా కంపెనీలు, స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో తీవ్ర ప్రభావ ప్రాంతాల్లో వంద శాతం బీమాలో నమోదయ్యేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు గురువారం తెలిపారు. బీమాలో 16.15 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నమోదైందని, అత్యధికంగా అనంతపురం జిల్లాలో 3.66, కర్నూలులో 3.31, శ్రీసత్యసాయిలో 2.31 లక్షల హెక్టార్లు నమోదైనట్లు తెలిపారు. గతేడాది కన్నా రాష్ట్రంలో బీమా విస్తీర్ణం పెరిగిందని, పంటల బీమా నమోదులో జాతీయ స్థాయిలో ఏపీ 5వ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 04:32 AM