Share News

ఆవుల అక్రమ రవాణాపై కొరడా

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:46 AM

ఆవులను అక్రమంగా తరలిస్తూ కొన్ని ముఠాలు రూ.కోట్లు ఆర్జిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పదుల కేసు ల్లో జైలుకు వెళ్లొచ్చిన కింగ్‌ పిన్‌ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు, రవాణా అధికారులకు..

ఆవుల అక్రమ రవాణాపై కొరడా

  • ప్రత్యేక తనిఖీలకు ఆర్టీఏ కమిషనర్‌ ఆదేశం

  • వారం రోజుల్లో 115కు పైగా వాహనాలు సీజ్‌

  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలీసుల కఠిన చర్యలు

  • ప్రతి నెలా 20 వేల పశువుల తరలింపు

  • 10 పశువులు పట్టే వాహనంలో 30కి పైగా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆవులను అక్రమంగా తరలిస్తూ కొన్ని ముఠాలు రూ.కోట్లు ఆర్జిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పదుల కేసు ల్లో జైలుకు వెళ్లొచ్చిన కింగ్‌ పిన్‌ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు, రవాణా అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలతో సమీక్షించిన ఐజీ గోపీనాథ్‌ జెట్టి... మామూళ్లు తీసుకుని వదిలేస్తున్న పోలీసులపై సీరియస్‌ అయ్యారు. ఆవుల అక్రమ రవాణా జరగడాని కి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో విజయనగరం ఎస్పీ దామోదర్‌, ఇతర జిల్లాల ఎస్పీలు రంగంలోకి దిగి కఠిన చర్యలు చేపట్టారు. పార్వతీపురం ప్రాం తంలో నిబంధనలకు విరుద్ధంగా గోవుల్ని హింసి స్తూ తీసుకెళ్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు ఇదే అంశంపై భారత జంతు సంక్షేమ మండలి నుంచి ఫిర్యాదులు అందడంతో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీవోలకు రవాణా కమిషనర్‌ ఎం.కె. సిన్హా వారం క్రితం కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల్లో 115 కు పైగా పశువుల అక్రమ రవాణా వాహనాలు ఆగిపోయాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్న 160కి పైగా వాహనాలు లైవ్‌స్టాక్‌ క్యారియర్‌, కంటైనర్‌ అనుమతి పొందాయి. వాటిలో 130 కి పైగా నిబంధనలు పాటించడం లేదని, పశువుల కు కనీసం నీరు ఇవ్వకుండా, నిలబడే స్థలం కూడా లేకుండా డబుల్‌ డెక్కర్లుగా తరలిస్తున్న విషయం తెలిసి ఉన్నతాధికారులు విస్తుపోయారు.


ఉత్పత్తి ఉత్తరాంధ్ర.. పాడి నాయుడుపేట..!

వ్యవసాయం తర్వాత గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న పాడి పశువుల ఉత్పత్తి మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే జరుగుతున్నట్లు.. పాడితో ఉపాధి పొందే రైతులందరూ సూళ్లూరుపేట ప్రాంతంలోనే ఉన్నట్లు గణాంకాలు(పశుసంవర్థక శాఖ డేటా) చెబుతున్నాయి. ప్రతినెలా 20వేలకు తగ్గకుండా పశువుల అక్రమ రవాణా జరుగుతుంటే అందులో సగానికిపైగా ఆవులేనని తెలుస్తోంది. నాయుడుపేట పరిసరాల్లో పాడి రైతులు దించుకుంటున్న ఈ ఆవులన్నీ ఏమైనట్లనే ప్రశ్నకు అనుమతులిచ్చిన పశుసంవర్థక శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు.

ఆ ఆవులన్నీ కేరళలో గోవధకు..

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆవులను కేరళలోని వధశాలలకు తరలిస్తున్నట్లు పోలీసులు ఆఽధారాల తో సహా గుర్తించారు. ఒడిశాలోని గిరిజన ప్రాంతాల నుంచి ఆవులను కాలినడకన పార్వతీపురం పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చి రూ.10వేలకు, రూ.25వేలకు అక్రమ రవాణా ముఠాకు విక్రయిస్తారు. వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి కేరళకు తరలిస్తున్న ముఠా ఆటను పోలీసులు, రవాణా శాఖ అధికారులు కట్టిస్తుండటంతో పాకయరావుపేట సమీపంలోని బీడు భూముల్లో వాటిని ఉంచి.. రైతుల ముసుగులో తరలిస్తున్నారు.

అక్రమార్కుల చేతికి ప్రభుత్వ లాగిన్‌

పశుసంవర్థక శాఖలో జిల్లాస్థాయి అధికారి ఒక రు ఉత్తరాంధ్రలో అక్రమార్కులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు విజిలెన్స్‌కు ఫిర్యాదులు వచ్చాయి. సదరు అధికారి పశువుల సరఫరాదారులకు ఏకంగా ప్రభుత్వ లాగిన్‌ ఇచ్చినట్లు తెలిసింది. ‘‘పశువు ఆరోగ్యంగా ఉంది.. ఆవును విక్రయించింది యజమానే.. వ్యాక్సిన్‌ వేయించాం.. తీసుకెళుతున్నది పాడి కోస మే..’’ అంటూ అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రభుత్వం ఇచ్చే అనుమతులను అక్రమ రవాణా గ్యాంగ్‌ స్వ యంగా ఎంటర్‌ చేస్తోంది. అనుమతులిచ్చే వ్యవస్థ చేతిలో ఉండటంతో ల్యాప్‌టా్‌పలో లాగిన్‌ అయ్యి సొంతంగా వివరాలు నమోదు చెస్తున్నారు. ఆ వెంటనే బొబ్బిలిలో ఉండే అధికారి వారికి ఓటీపీ చెబుతారు. దాన్ని నమోదు చేసి అనుమతి కాపీ ప్రింట్‌ తీసుకుంటున్నారు. 10 పశువులను తరలించాల్సిన వాహనంలో 30కి పైగా ఎక్కించి రాత్రివేళ లారీల్లో తరలిస్తున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 04:47 AM