Share News

18, 19 తేదీల్లో సీవోపీయూ సమీక్ష సమావేశాలు

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:16 AM

రాష్ట్ర శాసనసభ ప్రజా రంగ సంస్థల కమిటీ(కమిటీ ఆన్‌ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌-సీవోపీయూ) సమావేశాలు..

18, 19 తేదీల్లో సీవోపీయూ సమీక్ష సమావేశాలు

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ ప్రజా రంగ సంస్థల కమిటీ(కమిటీ ఆన్‌ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌-సీవోపీయూ) సమావేశాలు ఈ నెల 18, 19 తేదీల్లో ఏపీ శాసనసభ కార్యాలయ కమిటీ హాల్‌-1లో నిర్వహించనున్నట్లు శాసనసభ సెక్రటరీ జనరల్‌ ప్రసన్న కుమర్‌ సూర్యదేవర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత అథారిటీలు, కార్పొరేషన్ల స్థాపన లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితి, ఆస్తులు-అప్పులు, సంస్థల కార్యకలాపాలు, సాధించిన విజయాలు, సిబ్బంది వివరాలు, ఖాళీలు, రోస్టర్‌ అమలు తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 05:16 AM