కాంట్రాక్టు జేఎల్స్ సేవల పునరుద్ధరణ
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:51 AM
కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సేవలు పునరుద్ధరిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సేవలు పునరుద్ధరిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 3532 మంది కాంట్రాక్టు జేఎల్స్ సేవలు జూన్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు కొనసాగుతాయని తెలిపింది. మొత్తంగా 11 నెలల పాటు వీరికి జీతం అందుతుంది. అలాగే మోడల్ స్కూల్స్‌లో పనిచేసే 282 మంది కాంట్రాక్టు పీజీటీలు, టీజీటీల సేవలను కూడా పునరుద్ధరిస్తూ మరో ఉత్తర్వు జారీచేసింది. వీరి సేవలు కూడా జూన్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు కొనసాగుతాయి.