Minister Gottipati Ravikumar: విద్యుత్తురంగ ప్రైవేటీకరణకు కూటమి వ్యతిరేకం
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:27 AM
విద్యుత్తు రంగం ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
ఉద్యోగులందరి కష్టంతోనే ట్రూడౌన్ సాధ్యమైంది: గొట్టిపాటి
ఏపీఎ్‌సఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు రంగం ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎ్‌సఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ-2026ను సోమవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ.. విద్యుత్తు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి, ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శామ్యూల్, ప్రధాన కార్యదర్శి నాగ ప్రసాద్ పాల్గొన్నారు.