14 నుంచి సీఎం సింగపూర్ టూర్
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:36 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14 నుంచి సింగపూర్‌లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి 16 వరకు జరిగే 10వ ప్రపంచ నగరాల సదస్సు ....
లోకేశ్ స్థానంలో మంత్రి నారాయణ
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14 నుంచి సింగపూర్‌లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి 16 వరకు జరిగే 10వ ప్రపంచ నగరాల సదస్సు (వరల్డ్ సిటీస్ సమ్మిట్)లో సీఎం బృందం పాల్గొంటుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పెట్టుబడిదారులతోనూ భేటీ కానుంది. తొలుత సీఎంతోపాటు మంత్రి లోకేశ్ ఈ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, తాజాగా లోకేశ్ స్థానంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెళుతున్నారు. సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, సీఆర్డీయే కమిషనర్ వి.విజయ రామరాజు తదితరులు వెళుతున్నారు.