సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు అస్వస్థత
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:46 AM
ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం విజయవాడ కానూరు కామినేని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం విజయవాడ కానూరు కామినేని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. సమాచారం తెలిసిన వెంటనే విజయానంద్‌ను ఆసుపత్రిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... విజయానంద్‌ను హైదరాబాద్ ఎయిమ్స్‌కు తరలించాలని సీఎంఓ కార్యాలయ అధికారులను ఆదేశించారు. విజయానంద్ ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా సమీక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం విమానంలో ఆయనను హైదరాబాద్ ఎయిమ్స్‌కు తరలించే ఏర్పాట్లు సీఎంఓ చేస్తోంది. విజయానంద్‌తో కార్తికేయ మిశ్రా ఉంటారని సీఎంఓ అధికారులు తెలిపారు.