ఏపీకి రండి !
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:48 AM
సింగపూర్‌తో భారత్‌కు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు సత్సంబంధాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మూడు దశాబ్దాల కిందటి నుంచే ఆ దేశంతో కలసి పనిచేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..
నెల రోజులు బస చేయండి: సీఎం
మా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక విధానాలు పరిశీలించండి
రెండో నివాసంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చుకోండి
సింగపూర్‌తో మూడు దశాబ్దాలుగా సత్సంబంధాలు
అమరావతి నిర్మాణానికి అద్భుత ప్రణాళిక ఇచ్చింది
పెట్టుబడులకు రాష్ట్రం ఎంతో అనుకూలం
భారత ఎకనామిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్
భూమి, అనుమతులు వేగంగా ఇస్తున్నాం
నీటికి, విద్యుత్‌కు లోటులేదు.. సుదీర్ఘ తీరం,
అరుదైన ఖనిజ సంపద ఏపీ సొంతం
పోర్టులు, విమానాశ్రయాలతో గ్లోబల్ కనెక్టివిటీ
ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్ట్‌పలకు ప్రోత్సాహం
ఎలకాట్రనిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్ క్లస్టర్లు ఉన్నాయి.. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములవ్వండి
సింగపూర్‌లో పారిశ్రామికవేత్తలకు బాబు పిలుపు
సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో ప్రసంగం
సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సు, లీడర్‌షిప్ ప్లీనరీ-2లో పాల్గొన్న సీఎం
ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో ప్రపంచ ఆర్థికశక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది. త్వరలో భారత్ ఎకనామిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్ మారబోతోంది. వికసిత్ భారత్ 2047 విజన్‌లాగే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్‌కు రూపకల్పన చేశాం. సుదీర్ఘమైన తీరప్రాంతం, అరుదైన ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం. ఆక్వా, హార్టికల్చర్, వ్యవసాయం, సేవల రంగంలో ఏపీ కీలకమైన రాష్ట్రం. దేశంలోనూ, రాష్ట్రంలోనూ సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి.
- సీఎం చంద్రబాబు
అమరావతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): సింగపూర్‌తో భారత్‌కు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు సత్సంబంధాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మూడు దశాబ్దాల కిందటి నుంచే ఆ దేశంతో కలసి పనిచేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో ఓ టౌన్‌షి్‌పను కూడా నిర్మించామని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌ను ఇచ్చిందన్నారు. బ్లూ, గ్రీన్ రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం ఒక అద్భుతమైన ప్రణాళికను రూపొందించిందని చెప్పారు. అమరావతితో పాటు ఇతర నగరాల అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నామని తెలిపారు.
సింగపూర్ తర్వాత పెట్టుబడులు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని సీఎం అన్నారు. సింగపూర్ తర్వాత రెండో నివాసంగా అమరావతి, ఆంధ్రప్రదేశ్‌లను మార్చుకోవాలని ఆ దేశ పారిశ్రామిక వాణిజ్య, కమ్యూనికేషన్‌రంగ దిగ్గజ సంస్థలను కోరారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు రెండోరోజైన మంగళవారం సింగపూర్‌లో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు పారిశ్రామికవేత్తలకు వివరించారు. భూమి కేటాయింపులు, పారిశ్రామిక అనుమతులు వేగంగా ఇస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా నిర్దిష్టమైన కాలవ్యవధిని నిర్దేశించుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. 2028 నాటికి ఆర్సెల్లార్ మిట్టల్ ఉత్పత్తిని ప్రారంభించి రాష్ట్రం నుంచి ఎగుమతులు చేపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. వైజాగ్‌లో ఏర్పాటయ్యే గూగుల్ డేటా సెంటర్‌కు గ్రీన్‌ఎనర్జీని సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. గూగుల్‌తో పాటు పది గిగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయని వెల్లడించారు. ఎల్జీ ఎలకా్ట్రనిక్స్ కూడా రూ. 7 వేల కోట్లతో శ్రీసిటీలో ఎలక్ట్రిక్ గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ప్రారంభించబోతోందని చెప్పారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
ఏపీలో సానుకూల పారిశ్రామిక విధానాలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు కారణంగా వివిధ దేశాలు సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. పూర్తిస్థాయి సన్నద్ధతలో ఈ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఏపీ నుంచి ఎగుమతులు పెంచేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి కోసం స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఏపీలోని యువశక్తి సామర్థ్యాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధిని అందరిలోనూ పెంచుతున్నాం. పారిశ్రామిక సానుకూల పరిస్థితులను కల్పించేలా 26 పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నాం. ఏపీలో భూమి, నీటి లభ్యత పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదుల ద్వారా అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేసే వీలుంది. పారిశ్రామిక మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున కల్పిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతిఒక్కరినీ వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ‘వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఎంఎ్‌సఎంఈ సహా వివిధ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతను కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం. రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను అందిస్తున్నాం. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సను అమలు చేస్తున్నాం. పనిచేస్తూనే నైపుణ్యాలు, ఉన్నత విద్యార్హతలను సంపాదించేలా ఇ-ఆపరేషనల్ వర్సిటీలు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ విస్తృతి పెరిగింది. దీని ఆధారంగానే నిర్ణయాలు ఉంటున్నాయి. ఏపీలోనూ అదే తరహాలో డేటా డ్రివెన్ నిర్ణయాలను తీసుకుని పౌర సేవలను అందిస్తున్నాం.
మరో సింగపూర్‌లా అమరావతి
రాష్ట్రానికి ఉన్న వెయ్యి కిలోమీటర్లకుపైగా సముద్ర తీరప్రాంతంలో ఆరు అపెరల్ పోర్టులు ఆపరేషనల్ పోర్టులు ఉన్నాయి. ఈ పోర్టులకు దేశంలోని వివిధ పోర్టులను అనుసంధానం చేస్తూ సరుకు రవాణాను జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ చేస్తున్నాం. ఏడు ఆపరేషనల్ ఎయిర్‌పోర్టులు రాష్ట్రంలో ఉన్నాయి. భోగాపురంలాంటి అంతర్జాతీయ విమానాశ్రయంతో గ్లోబల్ నగరాలకు కనెక్టివిటీ ఏర్పడబోతోంది. లాజిస్టిక్స్, అగ్రికల్చరల్, సివిల్ ఏవియేషన్, ఎనర్జీ లాంటి వివిధ అంశాల్లో పంక్షనల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న పోర్టులను దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసేలా రహదారి, రైల్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎలకా్ట్రనిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్ క్లస్టర్లతో పాటు రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎంఎ్‌సఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమలోని పుట్టపర్తివద్ద ఐదో తరం ఫైటర్‌జెట్ తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీని రక్షణశాఖ ఏర్పాటు చేయబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచుతూ, కాలుష్యం తగ్గించేలా చర్యలు చేపడుతున్నాం. అమరావతిని మరో సింగపూర్‌గా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా కూడా అమరావతిని తయారు చే స్తాం. హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై లాంటి నగరాలను కనెక్ట్ చేస్తుంది. బ్లూ, గ్రీన్ సిటీగా అమరాతిని తీర్చిదిద్దు తాం. అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు, 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్-1 వస్తుంది.
భారత్‌కు వచ్చే పెట్టుబడుల్లో 25శాతం ఏపీకే
భారత్‌కు వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయి. సమీప భవిష్యత్తులో అంతా స్టా ర్ట్‌పలదే హవా. వాటిని ప్రోత్సహిస్తే పెద్దఎత్తున ఉత్పత్తికి అవకాశాలుంటాయి. అమరావతిలోనూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేస్తాం. స్పీడ్ ఆఫ్ డూయిం గ్ బిజినె్‌సను పరీక్షించాలంటే అమరావతికి రండి. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణలను, స్టార్ట్‌పలను ప్రోత్సహిస్తున్నాం. త్వరలోనే విశాఖ సమీపంలో సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఏపీలో అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయి.
అవకాశాల వేదికగా అమరావతి
ఉమ్మడి ఏపీ సీఎంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని.. రాష్ట్ర విభజన జరిగాక రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం తనకు వచ్చిందని చంద్రబాబు చెప్పారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ సిటీ గా నిర్మిస్తున్నామన్నారు. సింగపూర్‌లో లీడర్‌షిప్ ప్లీనరీ-2లో పాల్గొని ‘‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూ మన్స్!’’ అనే అంశంపై ప్రసంగించారు. 25 ఏళ్ల కిందటే ఐటీ గురించి మాట్లాడానన్నారు. ఫస్ట్‌మూవ ర్ అడ్వాంటేజ్‌తో ఈరోజు తెలుగువాళ్లు తలసరి ఆదాయంలో ముందున్నారని చెప్పారు. ఇప్పుడు ఏ ఐ వచ్చిందన్నారు. పీపుల్ ఫస్ట్ తమ ప్రభుత్వ విధానమని ప్రకటించారు. ఈక్విటీనేచర్, ఆపర్ట్యునిటీ, లివబుల్ సిటీగా అమరావతి ఉంటుందన్నారు. అం తర్జాతీయ మౌలిక సదుపాయాలతో, అవకాశాల వేదికగా నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. స్పోర్,్ట్స, ఫైనాన్షియల్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడి యా వంటి కాన్సెప్ట్స్ తీసుకువచ్చామన్నారు. రాజధా ని నిర్మాణం కోసం రైతులు 36,000 ఎకరాలను ఇచ్చారని వివరించారు. వాటిలో కొంత అభివృద్ధి చేసి రైతులకు ప్లాట్లను తిరిగి అప్పగిస్తున్నామని చెప్పారు. 21 కిలో మీటర్ల పొడవునా వాటర్ ఫ్రంట్ నగరంగా అమరావతి ఉంటుందని చెప్పారు. సైక్లిం గ్, వాకింగ్, గ్రీన్‌ఫీల్డ్, ఎయిర్ పోర్టు, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్‌జీరో లక్ష్యంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సైబరాబాద్‌లో నాడు ఎకరం రూ. 2లక్షలు ఉంటే.. నేడు రూ. 200 కోట్లకు చేరిందన్నారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుందనేందుకు సైబరాబాద్ నిదర్శనమన్నారు. నాలెడ్జ్‌సిటీగా అమరావతికి జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు తీసుకువస్తున్నామని చెప్పా రు. క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ఆకర్షణలని వివరించారు. ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా అమరావతి నిర్మితమవుతోందని అన్నారు. అమరావతిని సందర్శించి సరికొత్త ఆలోచనలతో అవకాశాలను వినియోగించుకోవాలని సదస్సులో పాల్గొన్నవారిని ఆహ్వానించారు.
సెమీకండక్టర్ తయారీకి ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం
రాష్ట్రానికి వచ్చి నెల రోజులు బస చేసి ప్రభు త్వ పారిశ్రామిక, వాణిజ్య, స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలను స్వయంగా పరిశీలించాలని, రాష్ట్రంలో పారిశ్రామిక-పెట్టుబడి సానుకూల విధానాన్ని స్వ యంగా పరిశీలించేందుకు అమరావతికి రావాలని సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఇక్కడకు వస్తే సెమీకండక్టర్ తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని గుర్తిస్తారన్నారు. సింగపూర్‌లో సెమీకండక్టర్స్‌పై నిర్వహించిన సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సదస్సులో గ్లోబల్ ఫౌండ్రీస్, ఎస్‌ఎక్స్‌సీ, ఎఎ్‌సఎంటీ, ఒన్ సిస్టమ్ టెక్నాలజీస్, టెక్సండ్ ఫోటోమాస్క్, ఆక్వాటెక్ తదతర సెమీకండటర్ల ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య సానుకూల వాతావరణంపై అధ్యయనం చేయాలని కోరారు. వాణిజ్య, పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభు త్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందని చెప్పా రు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అవసరమైన భూములు నిర్ణీత కాలవ్యవధిలో అందిస్తున్నామని, పెట్టుబడులు పెట్టాలని అన్నారు.
సీబీఎన్ @ 361డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరణ
ముఖ్యమంత్రిగా చంద్రబాబు దార్శనిక నేతగా తీసుకున్న నిర్ణయాల విశ్లేషణలతో తీర్చిదిద్దిన పుస్తకం ‘సీబీఎన్ @ 361 డిగ్రీస్’ను కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఆవిష్కరించారు. పుస్తకం ప్రతులను భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేకు, మంత్రి పి.నారాయణ అందించారు. ‘రేపటికోసం’ దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాసప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించారు. తెలుగులో పుస్తకాన్ని రిటైర్డ్ ఐఏఎస్ కేవీ సత్యనారాయణ ఇంగ్లీష్‌లోకి అనువదించారు. బా హ్య ప్రపంచానికి తెలియని పలు అంశాలు సీబీఎన్ @ 361 డిగ్రీస్‌లో వెల్లడించారని ఏపీ రెరా మాజీ చైర్మన్ రామనాథ్ చెప్పారు. సింగపూర్ రూ పకర్త లీ క్వాన్‌యూ శతజయంతిని పురష్కరించుకుని వెండి నాణేన్ని బాబు విడుదల చేశారు.