పారిశ్రామిక పార్కుల్లో 215.80 ఎకరాల భూ కేటాయింపులు
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:25 AM
రాష్ట్రంలోని 19 జిల్లాల్లో అభివృద్ధి పరచిన పారిశ్రామిక పార్కులలో పరిశ్రమల స్థాపన కోసం 215.80 ఎకరాల భూ కేటాయింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
599 దరఖాస్తులకు ప్రభుత్వ ఆమోదం
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 19 జిల్లాల్లో అభివృద్ధి పరచిన పారిశ్రామిక పార్కులలో పరిశ్రమల స్థాపన కోసం 215.80 ఎకరాల భూ కేటాయింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీఐఐసీ వైస్‌చైర్మన్ అండ్ ఎండీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన దినేశ్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్ర భూ కేటాయింపుల కమిటీ సమావేశమై మొత్తం 915 దరఖాస్తులను పరిశీలించింది. వాటిలో 599 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. దీంతో రూ. 2036.59 కోట్ల పెట్టుబడులతో ఎంఎ్‌సఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఆటోమొబైల్స్, ఎలకా్ట్రనిక్స్, లాజిస్టిక్స్, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్.. అనుబంధ పరిశ్రమలతో సహా వివిధ రంగాల్లో కొత్త పరిశ్రమలను నెలకొల్పనున్నారు. వాటి ద్వారా 11,488 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని దినేశ్ కుమార్ తెలిపారు.