టెన్త్ సోషల్ సిలబస్ తగ్గింపు
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:42 AM
పదో తరగతి సోషల్ స్టడీస్ సబ్జెక్టు సిలబ్‌సను ఎస్‌సీఈఆర్‌టీ తగ్గించింది. సిలబస్ చాలా ఎక్కువగా ఉందని, తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతుండటంతో..
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): పదో తరగతి సోషల్ స్టడీస్ సబ్జెక్టు సిలబ్‌సను ఎస్‌సీఈఆర్‌టీ తగ్గించింది. సిలబస్ చాలా ఎక్కువగా ఉందని, తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతుండటంతో సబ్జెక్టు నిపుణులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. జాగ్రఫీలో ‘జాతీయ ఎకానమీ ఆఫ్ లైఫ్‌లైన్స్’ పాఠ్యాంశాన్ని కేవలం మ్యాప్ రీడింగ్, మ్యాప్ పాయింటింగ్‌కు పరిమితం చేసింది. ఎకనామిక్స్‌లో గ్లోబలైజేషన్ అండ్ ది ఇండియన్ ఎకానమీలో 136-139, 140-141 పేజీలను తొలగించారు. వినియోగదారుల హక్కులు పాఠ్యాంశాన్ని కేవలం అంతర్గత ప్రాజెక్టుకు పరిమితం చేశారు.