Share News

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు వెబ్‌ ఆప్షన్లు

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:18 AM

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 104 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు..

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు వెబ్‌ ఆప్షన్లు

  • ఎంపికకు ఈ నెల 18,19 తేదీల్లో అవకాశం

విజయవాడ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 104 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏపీఎంఎస్ఆర్‌బీ) విడుదల చేసినట్టు హెల్త్‌, మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.పద్మావతి బుధవారం తెలిపారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ (డీపీహెచ్‌ ఎఫ్‌డబ్ల్యూ) పరిధిలోని ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణ బాధ్యతను ‘ఏపీటీ ఆన్‌లైన్‌ లిమిటెడ్‌’ సంస్థకు అప్పగించినట్టు తెలిపారు. మెరిట్‌ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా, ఖాళీల వివరాలను సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, అర్హులైన అభ్యర్థులు తమకు కావాల్సిన స్థానాలకు ఎంపిక చేసుకోవడానికి (వెబ్‌ ఆప్షన్ల నమోదుకు) గురువారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. అభ్యర్థులు https://aphfwrec.aptonline.in ద్వారా తమ వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చన్నారు. వెబ్‌ ఆప్షన్ల గడువు ముగిసిన అనంతరం, అభ్యర్థుల మెరిట్‌, వారు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా స్థానాల కేటాయింపు జరుగుతుందన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 04:20 AM