Share News

నీట్‌కు పటిష్ఠ ఏర్పాట్లు

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:54 AM

నీట్‌ (యుజీ)- 2026 రీ-ఎగ్జామినేషన్‌ను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఆదేశించారు.

నీట్‌కు పటిష్ఠ ఏర్పాట్లు

  • కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): నీట్‌ (యుజీ)- 2026 రీ-ఎగ్జామినేషన్‌ను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఆదేశించారు. ఆదివారం (21న) జరిగే నీట్‌ ఏర్పాట్లపై శనివారం ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. రాష్ట్రం నుంచి 65,790 మంది 185 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పూర్తిగా పర్యవేక్షించాలని చెప్పారు. సుమారు 1500 మంది పోలీస్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని నియమించామని తెలిపారు. సోషల్‌ మీడియాలో పేపర్‌ లీకేజీ వంటి వదంతులు సృష్టించి ప్రసారం చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 04:54 AM