Share News

సివిల్‌ సర్వెంట్లు సమర్థంగా సేవలు అందించాలి: సీఎస్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:23 AM

సివిల్‌ సర్వెంట్లు రూల్‌ ఆఫ్‌ లాకు లోబడి సమర్థవంతంగా సేవలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ స్పష్టం చేశారు.

సివిల్‌ సర్వెంట్లు సమర్థంగా సేవలు అందించాలి: సీఎస్‌

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): సివిల్‌ సర్వెంట్లు రూల్‌ ఆఫ్‌ లాకు లోబడి సమర్థవంతంగా సేవలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ స్పష్టం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో 18వ సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవం జరిగింది. సీఎస్‌ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర-2047, సిటిజన్‌ సెంట్రిక్‌ గవర్నెన్స్‌ ఫర్‌ లాస్ట్‌ మైల్‌ డెలివరీ అనే నినాదంతో ఈ వేడుకను నిర్వహించారు. సీఎస్‌ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో టఫ్‌గా ఉంటూనే.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు.

Updated Date - Apr 22 , 2026 | 05:25 AM