Share News

కర్ణాటకలో ఏపీ సీఐసీ, ఆర్టీఐ కమిషనర్ల పర్యటన

ABN , Publish Date - Mar 03 , 2026 | 05:00 AM

కర్ణాటక సమాచార కమిషన్‌ పనితీరు అధ్యయనానికి ఏపీ చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ (సీఐసీ) వజ్జా శ్రీనివాసరావు నేతృత్వంలోని ఆర్టీఐ కమిషనర్లు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు.

కర్ణాటకలో ఏపీ సీఐసీ, ఆర్టీఐ కమిషనర్ల పర్యటన

  • అక్కడి ఆర్టీఐ పనితీరు పరిశీలన

అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక సమాచార కమిషన్‌ పనితీరు అధ్యయనానికి ఏపీ చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ (సీఐసీ) వజ్జా శ్రీనివాసరావు నేతృత్వంలోని ఆర్టీఐ కమిషనర్లు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలుత అక్కడి ఇన్‌చార్జి చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ కె. రామన్‌తో బెంగళూరులో భేటీ అయ్యారు. కర్ణాటక సమాచార కమిషన్‌ పనితీరు గురించి తెలుసుకున్నారు. ఆ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ల కోర్టులకు హాజరైన కేసుల పరిష్కార తీరును ఏపీ కమిషనర్లు పరిశీలించారు. కలబురిగి, బెళగావిల్లో ఆర్టీఐ బెంచ్‌లున్నాయని, అక్కడ ఒక్కొక్క కమిషనర్‌ ఉండి పిటిషన్లు పరిష్కరిస్తారని రామన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సీఐసీ వజ్జా శ్రీనివాసరావు స్పందిస్తూ... కర్ణాటక సమాచార కమిషన్‌ వేగంగా కేసులు పరిష్కరిస్తున్న విధానం బాగుందని ప్రశంసించారు. ఈ పర్యటనలో ఏపీ సీఐసీతో పాటు ఇతర కమిషనర్లు రెహానా బేగం, గాజుల ఆదెన్న, ఉదయభాస్కర్‌రెడ్డి, వీఎస్‌ కళ్యాణ చక్రవర్తి, పి.సింహాచలం నాయుడు, చావలి సునీల్‌ ఉన్నారు. కర్ణాటక కమిషన్‌ నుంచి కమిషనర్లు మమత, రాజశేఖర, హరీశ్‌ కుమార్‌, రుద్రన్న, బద్రుద్దీన్‌, రిచర్డ్‌ డిసౌజా, మహేష్‌ వాల్వేకర్‌, వెంకట్‌సింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 05:00 AM