ఎంఎస్ఎంఈల బలోపేతానికి సహకరించండి
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:49 AM
టైర్-2, 3 పట్టణాల్లోని ఎంఎస్ఎంఈ బలోపేతానికి సహకరించాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు...
ఐసీఏఐ అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌కు ఏపీ చాంబర్స్ వినతి
విజయవాడ సిటీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : టైర్-2, 3 పట్టణాల్లోని ఎంఎస్ఎంఈ బలోపేతానికి సహకరించాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు సీఏడీ ప్రసన్నకుమార్‌ను ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు, ప్రతినిధులు రాజశేఖర్, సుబ్బారావు, అక్కయ్యనాయుడు కోరారు. ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసన్నకుమార్‌ను ఏపీ చాంబర్స్ ప్రతినిధులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. కార్పొరేట్ మిత్ర ఫ్రేమ్ వర్క్ అమలుకు సహకరించాలని, సంయుక్త ఎంఎస్ఎంఈ ఆర్థిక, అనుకరణ సహాయానికి కేంద్రాన్ని స్థాపించాలని, బ్యాంకులకు అనుకూలమైన డీపీఆర్‌లు, ఆర్థిక నిర్మాణంపై సాంకేతికంగా సాయం చేయాలని, ఆర్థిక క్రమశిక్షణ, డిజిటల్ అకౌంటింగ్, వ్యయ నియంత్రణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈల పునరుద్ధరణ, పునర్వ్యవస్థీకరణపై సలహాలు ఇవ్వాలని, ఐసీఏఐ ఆర్టికల్ ట్రైనీలను ఎంఎ్‌సఎంఈ యూనిట్లతో అనుసంధానించాలని వినతిపత్రం సమర్పించారు.