Share News

ఎంఎస్ఎంఈలను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:21 AM

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ (ఏపీ చాంబర్స్‌) ప్రభుత్వాన్ని సోమవారం కోరింది.

ఎంఎస్ఎంఈలను ప్రభుత్వం ఆదుకోవాలి

  • ముఖ్యమంత్రికి ఏపీ చాంబర్స్‌ వినతి

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ (ఏపీ చాంబర్స్‌) ప్రభుత్వాన్ని సోమవారం కోరింది. ఈ మేరకు ఏపీ చాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినతిపత్రం సమర్పించింది. ‘యుద్ధం ప్రభావంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. కీలక రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఖర్చులు దాదాపు 10 శాతం పెరిగిపోయి ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని పొట్లూరి భాస్కరరావు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో గత ఐదారేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక రాయితీలను వెంటనే విడుదల చేసి ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని కోరారు.

Updated Date - Apr 21 , 2026 | 04:21 AM