Share News

‘భవ్య’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:26 AM

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి ‘భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన (భవ్య) పథకం దోహదపడుతుందని ఏపీ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌...

‘భవ్య’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఏపీ చాంబర్స్‌

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి ‘భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన (భవ్య) పథకం దోహదపడుతుందని ఏపీ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ (ఏపీ చాంబర్స్‌) అభిప్రాయపడింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో దేశవ్యాప్తంగా రూ. 33,660 కోట్లతో 100 ప్లగ్‌ అండ్‌ ప్లే (రెడీ టు యూజ్‌) పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన ఈ పథకాన్ని స్వాగతించింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ ఛాంబర్స్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొట్లూరి భాస్కరరావు, బి.రాజశేఖర్‌, ఇతర ప్రతినిధి బృందం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌కు వినతిపత్రం సమర్పించింది.

Updated Date - Mar 24 , 2026 | 04:26 AM