దక్షిణ కొరియాతో ఏపీ చాంబర్స్ ఒప్పందం
ABN , Publish Date - May 22 , 2026 | 05:16 AM
దక్షిణ కొరియాతో పారిశ్రామిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఏపీ చాంబర్స్ ప్రత్యేక చొరవ తీసుకుంది.
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): దక్షిణ కొరియాతో పారిశ్రామిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఏపీ చాంబర్స్ ప్రత్యేక చొరవ తీసుకుంది. దక్షిణ కొరియాలోని చుంగ్‌చియోంగ్‌నమ్-డో ప్రావిన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సెపా ఇండియాతో అవగాహన ఒప్పందం (ఎం వోయూ) కుదుర్చుకుంది. విజయవాడలోని ఏపీ చాంబర్స్ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో చాంబర్స్ పదాధికారులు, అధికారులు, న్యూఢిల్లీకి చెందిన సెపా ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా కల్చర్, ఎలకా్ట్రనిక్స్, తయారీ, అనుబంధ రంగాలలో ద్వైపాక్షిక వాణిజ్యం, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.