Share News

రాష్ట్రంలో రీజినల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:18 AM

పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అండగా నిలిచేందుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (బీఐఎస్‌) నిర్వహణలో రీజినల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని..

రాష్ట్రంలో రీజినల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయండి

  • కేంద్రమంత్రికి ఏపీ చాంబర్స్‌ బృందం వినతి

ఇంటర్నెట్ విభాగం: పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అండగా నిలిచేందుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (బీఐఎస్‌) నిర్వహణలో రీజినల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఏపీ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఏపీ ఛాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసి వినతిపత్రం అందజేసింది. బియ్యం ఆధారిత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు అవసరమైన మద్దతు అందించాలని చాంబర్స్‌ ప్రతినిధులు కోరారు. తమ విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పొట్లూరి భాస్కరరావు తెలిపారు.

Updated Date - Jun 17 , 2026 | 04:19 AM