బంగ్లా డిప్యూటీ హైకమిషనర్‌తో ‘ఏపీ చాంబర్స్’ భేటీ
ABN , Publish Date - May 05 , 2026 | 04:42 AM
బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ మహ్మద్ అలిముజ్జామన్‌తో ఏపీ చాంబర్స్ ప్రతినిధులు చర్చలు జరిపారు.
అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ మహ్మద్ అలిముజ్జామన్‌తో ఏపీ చాంబర్స్ ప్రతినిధులు చర్చలు జరిపారు. చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం విజయవాడ పర్యటనకు వచ్చిన బంగ్లా డిప్యూటీ హైకమిషనర్‌ను కలిసి ఏపీ-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడంపై చర్చించారు. రాష్ట్రం నుంచి మసాలా దినుసులు, రొయ్యలు, మిర్చి, పసుపు, పండ్లు, అరకు కాఫీ, తృణధాన్యాలు, పత్తి, నూలు ఎగుమతులు, వాణిజ్య విస్తరణకు సహరించాలని కోరారు.