అభివృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా బడ్జెట్
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:19 AM
నిలకడైన అభివృద్ధి, ఉపాధి కల్పనను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలకూ ఊతమిచ్చేలా ఉందని ఏపీ చాంబర్స్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఏపీ చాంబర్స్ ప్రతినిధులు
విజయవాడ సిటీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): నిలకడైన అభివృద్ధి, ఉపాధి కల్పనను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలకూ ఊతమిచ్చేలా ఉందని ఏపీ చాంబర్స్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ అనిశ్చితి పరిస్థితుల్లోనూ దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు సరికొత్త ప్రణాళికతో బడ్జెట్‌ను రూపొందించడాన్ని అభినందించారు. చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ 2030 నాటికి దేశ అప్పులను జీడీపీలో 50శాతానికి తీసుకురావాలనే లక్ష్యంగా నిర్దేశించుకోవడం హర్షణీయమన్నారు. చాంబర్స్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్, డైరెక్టర్ సాంబశివరావు, బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధి నాగమల్లేశ్వరరావు, ఎంఎస్‌ఎంఈ సంఘం ప్రతినిధి ముళ్లపూడి సత్యనారాయణ, ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు మాట్లాడారు.