వాణిజ్య వంట గ్యాస్‌పై జీఎస్టీ తగ్గించాలి
ABN , Publish Date - May 16 , 2026 | 05:10 AM
ఆతిథ్య రంగానికి ఊరటనిచ్చేలా వాణిజ్య వంటగ్యాస్ (కమర్షియల్ ఎల్పీజీ) సిలిండర్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు ఏపీ చాంబర్స్ లేఖ
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): ఆతిథ్య రంగానికి ఊరటనిచ్చేలా వాణిజ్య వంటగ్యాస్ (కమర్షియల్ ఎల్పీజీ) సిలిండర్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ చాంబర్స్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ సమర్పించారు.