Share News

ఎల్‌పీజీ జీఎస్టీని 5 శాతానికి తగ్గించండి

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:34 AM

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లపై ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌, ఏపీ స్టార్‌ హోటల్స్‌..

ఎల్‌పీజీ జీఎస్టీని 5 శాతానికి తగ్గించండి

  • మంత్రి దుర్గేశ్‌కు ఏపీ చాంబర్స్‌ ప్రతినిధుల వినతి

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లపై ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌, ఏపీ స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేశ్‌ను కోరారు. శుక్రవారం వారు విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీ చాంబర్స్‌ సలహాదారు లక్ష్మీనారాయణ, అధ్యక్షులు పి.భాస్కరరావు ఇతర ప్రతినిధులు ఉన్నారు. కాగా, ఆతిథ్యం రంగంలోని సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి దుర్గేశ్‌ వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Jul 11 , 2026 | 05:34 AM