AP Cabinet Sub-Committee: రిటైర్మెంట్ వయసు పెంపుపై ఉపసంఘం భేటీ
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:40 AM
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం...
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది. కమిటీ సభ్యులు పురపాలకశాఖ మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసు పరిమితితో 2,831 మంది ఉద్యోగులు ఇప్పటికే కొనసాగుతున్నారు. దీంతో మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌లు, 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంపుపై చర్చించారు.