Share News

పదవీ విరమణ 62 ఏళ్లకు..!

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:07 AM

ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి కలిగించేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వెల్ఫేర్‌ సొసైటీల్లో పనిచేసే..

పదవీ విరమణ 62 ఏళ్లకు..!

  • క్యాబినెట్‌ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులకు లబ్ధి

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి కలిగించేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వెల్ఫేర్‌ సొసైటీల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు, గురుకుల పాఠశాలల్లో పని చేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ వయస్సు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 60 నుంచి 62 ఏళ్లకు పెంచడానికి ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం రెండు సార్లు తిరస్కరించిన ఈ ఫైలును 15 రోజుల క్రితం సీఎం ఆమోదం తెలిపారు. 2022 జనవరి 1 నుంచి ఈ నిర్ణయాన్ని వర్తింపచేసేలా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ఆయా సంస్థల్లో అవసరాల మేరకు తిరిగి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 15 వేల మందికిపైగా ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

Updated Date - Jun 24 , 2026 | 05:10 AM