Share News

AP Cabinet: జల్‌జీవన్‌ మిషన్‌కు 5 వేల కోట్ల రుణం

ABN , Publish Date - Jan 09 , 2026 | 06:06 AM

రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ అమలు కోసం జల్‌జీవన్‌ వాటర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌కు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (నాబ్‌పిడ్‌) మంజూరుచేసిన రూ.5 వేల కోట్ల రుణానికి....

AP Cabinet: జల్‌జీవన్‌ మిషన్‌కు 5 వేల కోట్ల రుణం

  • ప్రభుత్వ గ్యారెంటీకి రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం.. పలు పరిశ్రమలకు భూకేటాయింపులు

  • టెక్కలిలో కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం

  • డాక్టర్‌ సుధాకర్‌ కుమారుడికి డిప్యూటీ తహశీల్దార్‌ పోస్టు

  • పిచ్చుకలపాలెంలో జ్యుడీషియల్‌ అకాడమీ

  • క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ అమలు కోసం జల్‌జీవన్‌ వాటర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌కు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (నాబ్‌పిడ్‌) మంజూరుచేసిన రూ.5 వేల కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్పొరేషన్‌ వనరుల సమీకరణ పరిమితిని రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లకు పెంచడానికి అనుమతించింది. పలు పరిశ్రమలకు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు అందిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచార-పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం సచివాలయంలో క్యాబినెట్‌ సమావేశం తీసుకున్న నిర్ణయాలను అనంతరం ఆయన విలేకరులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ను సమగ్ర లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్‌ కంపెనీగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపిందన్నారు. లాజిస్టిక్స్‌, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం సంస్థాగత మూలధనాన్ని సమీకరించేందుకు తగిన పరిమాణంలో ఆంధ్రప్రదేశ్‌ లాజిస్టిక్స్‌ ఫండ్‌ను ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ నిధికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభ స్పాన్సర్‌గా మొత్తం మూలధనంలో 10-20 శాతం వాటా అందించనుంది. ఆర్సెలార్‌ మిట్టల్‌ నిస్పాన్‌ స్టీల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏఎంఎన్‌ఎ్‌స పోర్ట్స్‌ రాజయ్యపేట ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌గా మార్చడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా డీఎల్‌పురంలో క్యాప్టివ్‌ ఓడరేవును కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్పీవీకి కేటాయించేందుకు సవరించిన ఉత్తర్వుల జారీకి అనుమతిచ్చింది.ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్‌ ప్రతిపాదించిన ఏపీ క్లస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం(ఏపీ-సీడీపీ)పథకానికి ఆమోదం తెలిపింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకం రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో కనీసం 45 ఎంఎస్ఎంఈ కామన్‌ ఫెసిలిటీ సెంటర్లను ఎంఎ్‌సఎంఈ పార్కుల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు నడిపే పరిశ్రమలకు పెద్దపీట వేస్తారని మంత్రి తెలిపారు. ఈ నెల 6న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎ్‌సఐపీబీ) సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.


మరిన్ని నిర్ణయాలివీ..

  • తిరుపతి జిల్లాలో స్పేస్‌ సిటీలో ఇథేరియల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ గిల్డ్‌కు ఎకరా రూ.5 లక్షల చొప్పున 149.29 ఎకరాల భూమి.

  • చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మనేంద్రంలో పయనీర్‌ క్లీన్‌ యాంప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 55.47 ఎకరాల భూమి.

  • విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలం కొత్తాకి గ్రామంలో రాధికా వెజిటబుల్‌ ఆయిల్స్‌కు 64.67 ఎకరాల కేటాయింపు.

  • కడప జిల్లాలో ఎలక్ట్రికల్‌ స్టీల్‌ (కోల్డ్‌ రోల్డ్‌ గ్రెయిన్‌ ఓరియెంటెడ్‌-సీఆర్‌జీఓ), ప్యాకేజ్‌ సబ్‌స్టేషన్లు, రింగ్‌ మెయిన్‌ యూనిట్లు(ఆర్‌ఎంయూ), ప్యానెల్‌బోర్డులు, విండ్‌మాస్ట్‌, ఎలక్ట్రికల్‌ ఎక్వి్‌పమెంట్‌ కాంపోనెంట్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ తయారీకి గ్రీన్‌ఫీల్డ్‌ సౌకర్యం కల్పనకు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం.. భూమి కేటాయింపు.. ఏపీ-ఐడీపీ 2024-29 కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు.

  • రామ్‌కో సిమెంట్స్‌ లిమిటెడ్‌ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం.

  • నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రూ.1,500 కోట్లతో క్లింకర్‌, సిమెంట్‌ అండ్‌ వేస్ట్‌ హీట్‌ రికవరీ పవర్‌ప్లాంట్‌ విస్తరణకు ప్రత్యేక ప్రోత్సహకాలు. వెబ్‌సోల్‌ రెన్యువల్‌ పెట్టుబడి ప్రతిపాదనకు అనుమతి.

  • తిరుపతిలోని ఎంపీసెజ్‌ నాయుడుపేటలో 4 గిగావాట్స్‌ సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి ఏపీ-ఐడీపీ(4.0) 2024-29 కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు.

  • తిరుపతి జిల్లాలో రూ.200.82 కోట్ల పెట్టుబడితో సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ఏకీకృత పాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రోత్సాహకాలకు అనుమతి.

  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కొత్తబొమ్మాళిలో 2026-27 నుంచి కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు.

  • 2024-25 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్‌ల సేకరణ, సరఫరాకు రూ.944.53 కోట్ల పరిపాలనా ఆమోదానికి ఆమోదం.

  • ఏపీ షెడ్యూల్‌ కులాల సహకార ఆర్థిక సంస్థకు రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.1,500 కోట్ల రుణం మంజూరుకు సమ్మతి.

  • వైసీపీ వేధింపులతో మరణించిన డాక్టర్‌ సుధాకర్‌ కుమారుడు, సహకార శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.లలిత్‌ ప్రసాద్‌ను మానవతా కారణాలతో ప్రత్యేక కేసుగా పరిగణించి డిప్యూటీ తహశీల్దార్‌గా నియమించడానికి ఆమోదం.

  • రాజధాని పరిధిలోని పిచ్చుకలపాలెంలో ఆంధ్రప్రదేశ్‌ జ్యుడీషియల్‌ అకాడమీ నిర్మాణం, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, మౌలిక సదుపాయాల కల్పన, అంతర్గత రోడ్లకు రూ.165.33 కోట్లకు ఆమోదం.

  • బాపట్ల జిల్లా సూర్యలంకలో ఫైవ్‌స్టార్‌ కోస్టర్‌ రిసార్ట్‌ స్థాపన కోసం ఆర్నా కోస్టల్‌ రిసార్ట్స్‌కు భూమి, ప్రోత్సాహకాలు.

  • శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో శ్రీగణగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దిగువన మెగా ఆధ్యాత్మిక, సాంస్కతిక పర్యాటక కేంద్రం బేస్‌ క్యాంప్‌ అభివృద్ధికి బెంగళూరు ఇస్కాన్‌కు భూమి, ప్రోత్సాహకాలు.

  • జలవనరుల శాఖలో నామినేషన్‌ పద్ధతిలో అప్పగించే పనుల పరిమితిని రూ.5 లక్షల నుంచి 10లక్షలకు పెంచడానికి ఆమోదం.

Updated Date - Jan 09 , 2026 | 06:06 AM