Share News

బీసీ సంక్షేమానికి రూ.51,021 కోట్లు

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:33 AM

బీసీ సంక్షేమశాఖకు బడ్జెట్‌లో అత్యధికంగా రూ.51,021 కోట్లు కేటాయించారు. 2025-26లో రూ.47,456 కోట్లు కేటాయించగా...

బీసీ సంక్షేమానికి రూ.51,021 కోట్లు

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమశాఖకు బడ్జెట్‌లో అత్యధికంగా రూ.51,021 కోట్లు కేటాయించారు. 2025-26లో రూ.47,456 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.3,665 కోట్లు అధికంగా కేటాయించారు. ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమానికి రూ.10,669 కోట్లు, ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు, ఉచిత విద్యుత్‌ కోసం చేనేతలకు రూ.150 కోట్లు, సెలూన్లకు రూ.50 కోట్లు కేటాయించారు.

బడ్జెట్‌లో బీసీలకు ప్రాధాన్యం: మంత్రి సవిత

బీసీల అభ్యున్నతిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా మరోసారి రుజువైందని మంత్రి సవిత అన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో కేటాయింపులు చేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా బడ్జెట్‌ను రూపొందించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి సింహభాగం నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Feb 15 , 2026 | 04:33 AM